వసతి గృహాల విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీల పెంపు
హైదరాబాద్ (CLiC2NEWS): పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్, కాస్మొటిక్ ఛార్జీలను 40శాతం పెంచడంపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, గిరిజనాభివృద్ది శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలను గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని ఆమె తెలిపారు. ఈ ఛార్జీల పెంపుతో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరగనుంది. విద్యార్థులకు పోషకాహారం అందించాల్సి న బాధ్యత టీచర్లు, హాస్టల్ సిబ్బందిపై ఉందని మంత్రి అన్నారు.