తెలుగు విశ్వవిద్యాలయంలో విభిన్నకోర్సులు..
తెలుగులో లైబ్రరీ స్సైన్స్, యోగా, ఇంద్రజాలం, కీర్తనలు

హైదరాబాద్ (CLiC2NEWS): ఇప్పటి వరకు ఆంగ్ల మాధ్యమంలోనే అందుబాటులో ఉండే కోర్సులు తెలుగులో కూడా అందిస్తుంది తెలుగు విశ్వవిద్యాలయం. ఈ విద్యా సంవత్సరం నుండి పలు కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. అన్ని యూనివర్సిటీలలో ఆంగ్ల మాధ్యమంలోనే ఉండే లైబ్రరీ స్సైన్స్ కోర్సు.. తెలుగులో చదివేందుకు వీలు కల్పించింది. తెలుగు మాధ్యమంలో లైబ్రరీ స్సైన్స్ చదవాలనుకునే వారికి ఇదొక సదావకాశం.
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తున్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో వ్యాయామం, యోగా ఒక భాగమైపోయాయి. యోగాకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. యోగాలో డిప్లొమా చేయాలనుకునే వారికి ఈ అవకాశం తెలుగు విశ్వవిద్యాలయం అందిస్తోంది. యోగాలో మూడు రకాల కోర్సులను తీసుకొచ్చింది. సంవత్సర కాలంలో పూర్తయ్యే పిజి డిప్లమా, డిప్లమా, ఆరు నెలల వ్యవధి సర్టిఫికెట్ కోర్సును ప్రవేశపెట్టింది.
ఇంద్రజాలం: ఏడాది, ఆరునెలల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఇంద్ర జాలికుడు సామల వేణు ఆధ్వర్యంలో ఈ ఇంద్రజాలం తరగతులు నిర్వహిస్తున్నారు.
కీర్తనలపై సర్టిఫికెట్ కోర్సులు: అన్నమాచార్య, రామదాసు, తెలంగాణ వాగ్గేయకారుల కీర్తనలపై ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. సంవత్సరకాల వ్యవధితో పిజి డిప్లొమా ఇన్ ఫిలిం డైరెక్షన్, అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ అండ్ గ్రాఫిక్ డిజైన్, యుఐ/యఉయుఎక్స్/ డఇడిజిటల్ డ్రాప్టింగ్ అండ్ 3డి రెండరింగ్/ ఫఒఫొటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలో ఆరు నెలల వ్యవధి సర్గిఫికెట్ కోర్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.
I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.