`అనంత` జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఏడుగురు మృతి

అనంతపురం (CLiC2NEWS): జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో 7 గురు మరణించారు. పామిడి శివారులో 44వ జాతీయ రహదారిపై కూలీల ఆటోను లారీ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు కూలీలు మృతి చెందారు. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. తహసీల్దార్ కార్యలయం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన శంకరమ్మ, నాగవేణి, చిట్టెమ్మ(35), సుబ్బమ్మ(45), సావిత్రి(40) గా గుర్తించారు.
ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వీరంతా పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లిలో పత్తికోతకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది గాయపడగా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ఒకరు చికిత్స పొందుతూ చనిపోయారు. ఆటో డ్రైవర్ రాంగ్ రూట్లో వెళ్లడం వల్లే ళ్తుండడం వల్లే ప్రమాదం జరిగిందని తాడిపత్రి డీఎస్పీ చైతన్య చెప్పారు. మృతులను సుబ్బమ్మ, శంకరమ్మ, నాగవేణి, సావిత్రి, చౌడమ్మగా గుర్తించారు. వీరిది గార్లదిండె మండలం కొప్పలగొండ.
పాదాచారులను ఢీ కొన్న కారు.
ఇదే జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఓ కారు పాదచారులను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద ప్రమాదం జరిగింది. మిడుతూరు వద్ద జాతీయ రహదారిపై కారు పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటనలో యాకోబ్(62), నారాయణ(60) అనే వ్యక్తులు మృత్యువాతపడ్డారు. సెక్యురిటీ గార్డులుగా పనిచేస్తున్న వారు.. విధులు ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులుచెప్పారు.