వ్య‌క్తిగ‌త స‌మాచార దుర్వినియోగానికి పాల్ప‌డితే రూ. 250 కోట్ల జ‌రిమానా

ఢిల్లీ (CLiC2NEWS): ఏదైనా కంపెనీ వ్య‌క్తిగ‌త స‌మాచార దుర్వినియోగానికి పాల్ప‌డితే.. రూ. 250 కోట్ల జ‌రిమానా విధించ‌నున్నారు. డిజిట‌ల్ ప‌ర్స‌న‌ల్ డేటా ప్రొటెక్ష‌న్ బిల్ – 2023ని కేంద్ర ఐటి శాఖ మంత్రి అశ్వినీ లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. దేశంలోని పౌరుల డిజిట‌ల్ హ‌క్కుల‌ను బ‌లోపేతం చేయ‌డ‌మే కాకుండా.. వ్య‌క్తిగ‌త స‌మాచార దుర్వినియోగానికి పాల్ప‌డే వార‌ని శిక్షించడానికి వీలుగా ఈ బిల్లును సాదారంణ బిల్లుగానే దిగువ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. దీనిని ద్ర‌వ్య బిల్లుగా తీసుకొచ్చార‌న్న విప‌క్షాల ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న కొట్టిప‌డేశారు.

ఆన్‌లైన్ మోసాలు విప‌రీతంగా పెరిగిపోతున్న నేప‌థ్యంలో ఈ బిల్లు ఆమోదం పొందితే.. ప్ర‌తి పౌరుడి డిజిట‌ల్ హ‌క్కుల‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని ఐటి శాఖ స‌హాయ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్ అన్నారు. ప్ర‌జ‌ల నంఉడి అభిప్రాయాలు సేక‌రించిన త‌ర్వాత ముసాయిదా బిల్లులో ప్ర‌తిపాదించిన అనేక నిబంధ‌న‌లు స‌డ‌లించిన‌ట్లు స‌మాచారం. ఈ బిల్లు ప్రకారం ఏదైనా కంపెనీ స‌మాచార దుర్వినియోగానికి పాల్ప‌డితే.. క‌నిష్టంగా రూ.50 కోట్ల, గ‌రిష్టంగా రూ. 250 కోట్ల వ‌ర‌కు జ‌రిమానా విధించ‌నున్నారు.

1 Comment
  1. cipit88 says

    Ahaa, its fastidious dialogue about this article at this place at this webpage, I have
    read all that, so now me also commenting at this place.

Leave A Reply

Your email address will not be published.