TS: రేపటి నుంచి ప్రత్యక్ష తరగతులు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను తెరువాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో రేపటి నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. గురుకులాలు మినహా మిగతా పాఠశాలల్లో రేపటి నుంచి పాఠశాలలను కొవిడ్ నిబంధనల మేరకు తెరిచేందుకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.
- ప్రత్యక్ష బోధనపై విద్యార్థులను పాఠశాలలు బలవంతపెట్టొద్దని ప్రభుత్వం ఆదేశించింది.
- ఆన్‌లైన్, ప్రత్యక్ష బోధన అంశంపై పాఠశాలలదే నిర్ణయమని పేర్కొంది.
- పాఠశాలలు అనుసరించాల్సిన విధివిధాలను రూపొందించాలని ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆదేశాలిచ్చింది.
- అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎస్‌ఓపీలపై విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది.
- హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.