విజయవాడ నుండి కువైట్‌కు నేరుగా విమాన సర్వీసు..

గన్నవరం (CLiC2NEWS): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా కువైట్‌కు ప్రత్యేక సర్వీసును బుధవారం ప్రారంభించారు. ఇకనుండి ప్రతి బుధవారం ఎయుర్ ఇండియా సర్వీసును నడపనున్నారు. అక్టోబర్ 28వ తేదీ వరకు ఈ ప్రత్యేక సర్వీసు కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు. ఉదయం 9.55 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుండి సుమారు 66 మంది ప్రయాణికులతో విమానం కువైట్‌కు బయలుదేరుతుంది. తిరిగి రాత్రి 8.35 గంటలకు విజయవాడకు చేరుతుంది. ప్రత్యేక విమాన సర్వీసు నిర్వహించేందుకు ముందుకొచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సంస్థకు అధికారులు అభినందనలు తెలిపారు.