రుణాల పంపిణీ వేగవంతం చేయాలి: మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెల‌గాణ‌లో ఎస్సీ రుణాల పంపిణీని వేగవంతం చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారులను ఆదేశించారు. 2020-21 కార్యచరణ ప్రణాళిక అమలు, రూపొందించాల్సిన ప్రణాళికపై మాసబ్‌ ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ స‌మీక్ష‌లో మంత్రి మాట్లాడుతూ వృత్తి నైపుణ్యంతో సంబంధం లేని రుణాలను, నెలాఖరులోగా ఇవ్వాలని, వృత్యి నైపుణ్యానికి సంబంధించి రుణాలను డిసెంబర్‌ చివరి నాటికి ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గమైన ధర్మపురిలో ఎస్సీ స్టడీ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు కార్యదర్శి రాహుల్‌ బొజ్జా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.