సుప్రీంకోర్టులో బిల్కిస్ బానోకు ఎదురుదెబ్బ..
ఢిల్లీ (CLiC2NEWS): బిల్కిస్ బానో తనపై దారుణానికి పాల్పడిన దోషుల విడుదలపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసినదే. 2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో అల్లర్ల జరిగినపుడు బిల్కిన్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆసమయంలో ఆమె ఐదు నెలల గర్భిణి. అంతే కాకుండా ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురుని దుండగులు హత్య చేశారు. ఈ కేసులో మొత్తం 11 మందికి సిబిఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే వీరిని గుజరాత్ ప్రభుత్వం ఇటీవల స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల చేసింది. దోషులకు రెమిషన్ పాలసీని అమలు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పపై బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.