హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల‌కు మంచినీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో 8వ తేదీ ఉద‌యం నుండి 10వ తేది ఆర్ధ‌రాత్రి వ‌ర‌కు మంచినీ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డ‌నున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. రైల్వే శాఖ సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద నూతనంగా ట్రాక్ లైన్ ను నిర్మించ తలపెట్టింది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా హైదరాబాద్ మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్య్లూఎస్ఎస్) ఫేజ్ – 1 లో కొండపాక నుంచి ఘన్ పూర్ కు ఉన్న 3000 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపు లైన్ ను ప‌క్క‌కు మార్చాల్సి ఉంది. కావున 8వ తేదీ ఉద‌యం 6 గంట‌ల నుండి 10వ తేదీ అర్ధ‌రాత్రి.. మొత్తం 66 గంటల పాటు ఈ పనులు జరుగుతాయి. కావున‌ ఈ 66 గంటలు కింద పేర్కొన్న రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో పూర్తిగా.. కొన్ని చోట్ల పాక్షికంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

పూర్తిగా అంత‌రాయం ఏర్ప‌డు ప్రాంతాలు:

షాపూర్, చింతల్‌, జీడిమెట్ల‌, వాణి కెమిక‌ల్స్, జ‌గ‌ద్గిరిగుట్ట‌, గాజుల రామారం, సూరారం.

(మ‌ల్కాజ్ గిరి/అల్వాల్‌) : డిఫెన్స్ కాల‌నీ.

నాగారం/ ద‌మ్మాయి గూడ‌, కీస‌ర‌.

బొల్లారం : రింగ్ మెయిన్-3 ఆన్ లైన్ స‌ప్లై.

కొంప‌ల్లి : కొంప‌ల్లి, గొండ్ల పోచంప‌ల్లి ప్రాంతాలు.

కొండ‌పాక (జ‌న‌గామ‌, సిద్దిపేట‌), ప్రజ్ఞాపూర్ (గ‌జ్వేల్‌), ఆలేర్ (భువ‌న‌గిరి), ఘ‌న్ పూర్ (మేడ్చ‌ల్‌/ శామీర్ పేట‌), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్‌, తుర్క‌ప‌ల్లి బ‌యోటెక్ పార్కు.

(ఉప్ప‌ల్‌) : కాప్రా మున్సిపాలిటీ ప‌రిధి ప్రాంతాలు.

 

పాక్షికంగా అంత‌రాయం ఏర్ప‌డు ప్రాంతాలు:

ఎస్. ఆర్‌. న‌గ‌ర్‌ : బోర‌బండ‌, వెంక‌ట‌గిరి, బంజారాహిల్స్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు, ఎర్ర‌గ‌డ్డ‌, అమీర్ పేట్‌, ఎల్లారెడ్డి గూడ‌, యూసుఫ్ గూడ‌.

కూక‌ట్ ప‌ల్లి : కేపీహెచ్ బీ, మల్యాసియ‌న్‌ టౌన్ షిప్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.

శేరిలింగం ప‌ల్లి: లింగంప‌ల్లి నుంచి కొండాపూర్ వ‌ర‌కు గ‌ల ప్రాంతాలు, గోపాల్ న‌గ‌ర్‌, మ‌యూర్ న‌గ‌ర్‌, రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.

నిజాంపేట్‌ : ప్ర‌గ‌తి న‌గ‌ర్ ప్రాంతం, నిజాంపేట్/ బాచుప‌ల్లి.

నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.

 

 

 

Leave A Reply

Your email address will not be published.