హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ క‌మిటి ర‌ద్దు: సుప్రీంకోర్టు

ఢిల్లీ  (CLiC2NEWS): హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సిఎ) క‌మిటీని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ర‌ద్దు చేసింది. ఈ క‌మిటీ స్థానంలో మాజీ జ‌డ్జి జ‌స్టిస్ లావు నాగేశ్వ‌రరావు తో నూత‌న ఏక‌స‌భ్య‌ క‌మిటీని నియ‌మించిన‌ట్లు తీర్పునిచ్చింది. ఇక‌పై హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ వ్య‌వ‌హారాల‌న్నీ కొత్త క‌మిటీ చూసుకుంటుంద‌ని సుప్రీంకోర్టు తెలిపింది. నూత‌న క‌మిటి నివేదిక ప్ర‌కారం త‌దుప‌రి ఆదేశాలు జారీ చేస్తామ‌ని వెల్ల‌డించింది.

హెచ్‌సిఎ కు తాత్కాలిక అధ్యాక్షుడిగా ఉన్న భార‌త మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హెచ్‌సిఎ అంబుడ్స్‌మెన్‌గా జ‌స్టిస్ దీప‌క్ వ‌ర్మ నియామ‌కాన్ని తెలంగాణ హైకోర్టు స‌మ‌ర్థించ‌డంపై ప్ర‌తివాదులు స‌ర్వోన్న‌త‌ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. వీరి త‌ర‌పు సీనియ‌ర్ న్యాయ‌వాది జ‌స్టిస్ లావు నాగేశ్వ‌ర‌రావుకు హెచ్‌సిఎ బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని కోరారు.  ఈమేర‌కు మంగ‌ళ‌వారం  హెచ్‌సిఎను న్యాయ‌స్థానం ర‌ద్దు చేసింది. . జ‌స్టిస్ ఎల్. నాగేశ్వ‌ర‌రావుకు అన్నివిధాలా స‌హ‌క‌రించాల‌ని హెచ్‌సిఎను ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.