కేవలం ప్రేమికులదేనా ప్రేమ!

 

పుట్టిన రోజు పండుగే అంద‌రికీ.. అన్న‌ట్లు ప్రేమికుల రోజు కూడా పండుగే ప్రేమికుల‌కి. మ‌రి ఈ రోజు ప్రేమికులు ఒక‌రికి ఒక‌రు విషెస్ చెప్పుకోవ‌డం, గిప్ట్స్ ఇవ్వ‌డం వంటివి చేస్తుంటారు. ప్రేమ అంటే.. కేవలం అబ్బాయి – అమ్మాయి మ‌ధ్యనే ప్రేమ ఉంటుందా..? పిల్ల‌ల‌కు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండ‌దా. త‌ల్లి దండ్రుల‌కు పిల్ల‌ల మీద ప్రేమ ఉండ‌దా..? చెల్లికి అన్న‌మీద ప్రేమ ఉండ‌దా.. అన్న‌కు త‌మ్ముడిమీద.. ఇలా.. ఇదంతా ఎందుకు? కొంత‌మందికి ప్ర‌కృతిని ప్రేమిస్తుంటారు. కొంద‌రికి పక్షులంటే ఇష్టం, కొందరికి చెట్లు… ఇది ప్రేమ కాదా!. కొందరు ఒక మొక్క‌ను ఎంతో ప్రేమ‌గా పెంచుకుంటారు.. మరికొందరు ఒక కుక్క‌ను కూడా ప్రేమ‌గా పెంచుకుంటారు. వాటికేమ‌న్నా అయితే ఎంతో బాధ‌ప‌డ‌తారు. మొక్క చ‌నిపోయినా చింతిస్తారు. ఇది ప్రేమ‌కాదా..?
ఇలా వీటిని ప్రేమించే వారికి ఎవ‌రిస్తారు గిప్ట్స్ .. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక వ్యాసం రాయొచ్చు.

త‌ల్లి దండ్రుల‌కు మ‌ద‌ర్స్ డే. ఫాద‌ర్స్ డే అంటూ రెండు రోజులు పెట్టేశారు. భార్యాభ‌ర్త‌లు ప్రేమికులు కారా ? మ‌హిళ‌ల‌కు ఒక‌రోజు.. పురుషుల‌కు ఒక రోజు. ఈరోజు కూడా ల‌వ్ యూ అమ్మా అని విష్ చేయండి. భ‌ర్త, భార్య‌ను.. భార్య, భ‌ర్త‌ను వారుకూడా ఒక‌రికొక‌రు ఈ రోజు విష్ చేసుకోండి. ఒక స్వీట్ తినిపించండి.  ఈ విధంగా చేస్తే బావుంటుంది క‌దా!

మ‌న చిన్న‌పుడు బంధువుల‌తో బాగా అఫెక్ష‌న్‌గా ఉంటాం. మామ‌య్య పిల్ల‌లో.. బాబాయి పిల్ల‌లో.. అత్త‌య్య వాళ్ల పిల్ల‌ల‌తో.. ఇలా వారితో క‌లిసి మ‌నం సెల‌వుల‌కు, పండుగ‌ల‌కు క‌ల‌సి ఆడుకుంటాం. ఇలా ప్ర‌తి సంవ‌త్స‌రం జ‌రుగుతుంది. కానీ, పై చ‌దువులకు వెళుతున్న కొద్దీ వీరి మ‌ధ్య దూరం పెరుగుతుంది. వివాహాలు జ‌రిగిన త‌ర్వాత ఆ దూరం మ‌రింత ఎక్కువ‌వుతుంది. ఎప్పుడైనా వారు గుర్తొచ్చి.. మాట్లాడ‌డానికి టైం కుద‌ర‌లేద‌ని అనుకుంటూ ఉంటాం క‌దా.. ఈ రోజు వారికి ఫోన్ చేసి మాట్లాడండి. ఇంకా చెప్పాల‌ని ఉంది. కానీ బోర్‌కొడుతుంద‌ని ఆపేస్తూ.. ప్ర‌తి ఒక్క‌రికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్ష‌లు ..

-పూర్ణిమా

అడ్వ‌కేట్‌

Leave A Reply

Your email address will not be published.