రక్త దాతలకు ‘చిరు భద్రతా’ కార్డుల పంపిణీ

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా రక్తదాతలకు ‘చిరు భద్రతా’ (లైఫ్ ఇన్సూరెన్స్) కార్డుల పంపిణీ చేశారు. చిరంజీవి బ్రడ్ బ్యాంక్ ద్వారా 50 కంటే ఎక్కవ సార్లు రక్తదానం చేసిన వారికి ఈ భద్రతా కార్డులనందించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ..
బ్లడ్ బ్యాంక్ ద్వారా విశేషమైన సేవలందిస్తున్న చిరంజీవికి అమె అభినందనలు తెలియజేశారు. రాజ్‌భవన్ తరపున రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నట్లు, అవసరమైన వారికి రక్తం అందించే విధంగా యాప్‌ను రూపొందించామని తెలిపారు. దీనిలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కూడా భాగం కావాలని గవర్నర్ కోరారు. తాను హౌస్ సర్జన్‌గా చేస్తున్న సమయంలో బాధితులకు రక్తం ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు సైతం ముందుకు రాని రోజులు చూశానని గర్తుచేసుకున్నారు.
అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. తన కోసం ఏమైనా చేసే అభిమానుల ప్రేమను నలుగురికి ఉపయోగా పడేలా చేయాలనే ఉద్దేశ్యంతో రూపొందినదే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని అన్నారు. తరచూ 2 నుండి 3 వేల మంది రక్తదానం చేస్తున్నారని ఈసందర్భంగా తెలిపారు. ఇలాంటి వారికి ఏదైనా భద్రత కల్పించాలనే ఉద్దేశంతో చిరు భద్రత పేరుతో ఈ కార్యక్రమం చేపట్టామని అయన తెలియజేశారు.