టీఎన్జీవో ఆధ్వర్యంలో మ‌ట్టి గ‌ణ‌ప‌తి విగ్ర‌హాల‌ పంపిణీ

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): ప్లాస్ట‌ర్ ఆఫ్ పారిస్‌, ఇత‌ర ర‌సాయ‌నాల‌తో త‌యారుచేసిన వినాయ‌క విగ్ర‌హాల వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణానికి న‌ష్టం జ‌రుగుతుంద‌ని, కాబ‌ట్టి ప్ర‌తీ ఒక్క‌రూ మ‌ట్టి వినాయ‌కుల‌ను పూజించి ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుకోవాల‌ని టీఎన్జీవో అసోసియేష‌న్ జ‌ల‌మండ‌లి విభాగం అధ్య‌క్షుడు మ‌హేష్ కుమార్ పేర్కొన్నారు. బుధ‌వారం ఖైర‌తాబాద్‌లోని జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో టీఎన్జీవో అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఉద్యోగులు, సిబ్బందికి మ‌ట్టి గ‌ణ‌ప‌తి విగ్ర‌హాల‌ను పంపిణీ చేశారు.

మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల పంపిణీ మ‌రో రెండు రోజుల పాటు జ‌రుగుతుంద‌ని, భ‌క్తులు జ‌ల‌మండ‌లి ఖైర‌తాబాద్ ప్ర‌ధాన కార్యాల‌యానికి వ‌చ్చి తీసుకోవ‌చ్చ‌ని టీఎన్‌జీవో నాయ‌కులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఎన్‌జీవో నాయ‌కులు ర‌జినీకాంత్‌, సంతోష్‌, అజ‌య్ సింగ్‌, సాయికృష్ణ‌, ఇత‌ర నాయ‌కులు, జ‌ల‌మండ‌లి ఉద్యోగులు పాల్గొన్నారు.

1 Comment
  1. Raghavendrra says

    *మిత్రులు, శ్రేయోభిలాషులకు నమస్కారం. అందరూ సెకండ్ డోస్ టీకా గోషామహల్ లో 13-8-2021 నుండి 15-8-2021 వరకు వేయించుకో గలరు, కొవిడ్-19 జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నాము. జలమండలి ఉద్యోగుల హక్కుల సాధనకు తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ఎప్పుడూ కృషి చేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. ఉద్యోగులు, సిబ్బందికి హెల్త్‌ కార్డుల జారీ కోసం ఎంతో పోరాటం చేశాం. యాజమాన్యం సానుకూలంగా స్పందించింది…… ఆగస్ట్ 2021 నెలలో Rs.6.5 crores డబ్బు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ కి చెల్లించారు, అయితే ఇప్పటివరకు హెల్త్‌కార్డులు ఇవ్వలేదు. హెల్త్ కార్డులు ఆలస్యం కావడంతో కొందరు ఉద్యోగులు హాస్పిటల్లో బిల్లులు చెల్లించాల్సి వచ్చింది. హెల్త్ కార్డులు ఇవ్వకపోవడాన్ని జలమండలి ఎండీ గారి దృష్టికి తీసుకెళ్లాము. ఇన్ని రోజులు జలమండలి ఉద్యోగులు నష్టపోయినందుకు న్యాయం చేయాలని ఎండీ గారికి వివరించాం. ఎవరో వచ్చి ఇస్తారని ఇన్ని రోజులు ఆపడం సరికాదు. దీన్ని అందరు గమనించాలని మనవి.*

    RAGHAVENDRRA RAJ
    GENERAL SECRETARY
    TELANGANA JALAMANDALI
    EMPLOYEES UNION B-2898

Leave A Reply

Your email address will not be published.