వంద కోట్లు దాటిన డోసుల పంపిణీ

న్యూఢిల్లీ (CLiC2NEWS): భార‌త్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో మరో మైలురాయిని అధిగమించింది. క‌రోనా మ‌హమ్మారి కోర‌లు విరిచేందుకు భార‌త్ చేప‌ట్టిన `టీకా మ‌హోద్య‌మం` నేడు (గురువారం) కీల‌క ఘ‌ట్టానికి చేరుకుంది. ఇవాళ్టితో శ‌త‌కోటి ప్ర‌యాణాన్ని నిర్విగ్నంగా పూర్తి చేసింది. ప్ర‌పంచంలోనే చైనా త‌ర్వాత 100 కోట్ల డోసుల ను అందించిన దేశంగా భార‌త్ కీర్తి గ‌డించింది.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 16న క‌రోనా వ్యాక్సినేష‌న్ ను కార్య‌క్ర‌మాణ్ని ప్రారంభించారు. తొలి ద‌శ‌లో వైద్యులు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుధ్య కార్మికుల‌కు టీకాలు ఇచ్చారు. ఆత‌ర్వాత ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ల పైబ‌డిన వారికి, మే 1 నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారికి టీకాలు అందించారు.

Leave A Reply

Your email address will not be published.