Hyderabad: జూన్ 9 న చేప ప్రసాదం పంపిణీ..

హైదరాబాద్ (CLiC2NEWS): కరోనా మహమ్మారి కారణంగా గత మూడు సంవత్సారాలనుండి చేప ప్రసాదం పంపిణీ నిలివేసిన విషయం తెలిసిందే. తిరిగి జూన్ 9 వ తేదీన బత్తిన సోదరుల చేప ప్రసాదం ప్రారంభించనున్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. చేప ప్రసాదం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున పకడ్బందీగా ఏర్పాటు చేస్తామన్నారు. 170 సంవత్సరాల నుండి చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాలనుండి కూడా ఈ చేప ప్రసాదం కోసం లక్షలాది మంది ఇక్కడకు వస్తుంటారని అన్నారు.