విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ‌లు భ‌ర‌ణానికి అర్హులు: సుప్రీంకోర్టు

ఢిల్లీ (CLiC2NEWS): ముస్లిం మ‌హిళ‌లు విడాకులు తీసుకున్న త‌ర్వాత కూడా భ‌ర‌ణానికి అర్హుల‌ని దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కీల‌క‌ తీర్పు నిచ్చింది. 125 సిఆర్‌పిసి ప్ర‌కారం విడాకులు తీసుకున్న త‌న భార్య‌కు భ‌ర‌ణం చెల్లించాలంటూ ఇచ్చిన ఆదేశాల‌ను ఓ ముస్లిం వ్య‌క్తి స‌వాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిని జ‌స్టిస్ బివి నాగ‌ర‌త్న‌, జ‌స్టిస్ అగ‌స్టీన్‌, జార్జ్ మాసిహ్‌ల‌తో కూడిన ధ‌ర్మాసం కొట్టివేసింది. విడాకుల త‌ర్వాత త‌మ భ‌ర్త నుండి వారు భ‌ర‌ణం కోర‌వ‌చ్చ‌ని తీర్పునిచ్చింది. భ‌ర‌ణానికి సంబంధించిన హ‌క్కును క‌ల్పించే ఆ సెక్ష‌న్‌ను విడాకులు తీసుకున్న ముస్లిం మ‌హిళ‌ల‌కు వ‌ర్తింప‌జేస్తున్న‌ట్లు తెలిపింది.

సెక్ష‌న్ 125 వివాహిత‌ల‌కే కాకుండా మ‌హిళ‌లంరికీ వ‌ర్తిస్తుంది. మ‌తంతో సంబంధం లేకుండా ఈ సెక్ష‌న్ కింద వివాహిత‌లు భ‌ర‌ణం కోర‌వ‌చ్చు. భ‌ర‌ణం ఇవ్వ‌డం అనేది దాతృత్వం కాదు. భార్య త‌మ‌పై మాన‌సికంగా, ఇత‌ర రకాలుగా ఆధార‌ప‌డి ఉంటుంద‌నే వాస్త‌వాన్ని కొంద‌రు భ‌ర్త‌లు గుర్తించ‌డం లేద‌ని.. గృహిణి పాత్ర‌ను , ఆమె త్యాగాన్ని గుర్తించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది అని ధ‌ర్మాస‌నం తీవ్రంగా స్పందించింది.

 

Leave A Reply

Your email address will not be published.