అయోధ్యలోని వానరసేనకు దీపావళికానుక..! అక్షయ్‌కుమార్

Akshay Kumar: బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ దీపావళి సందర్బంగా మూగ జీవాల రక్షణ కోసం మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆయోధ్యలోని వానరసేనకు తనవంతు కృషిచేశారు. రామమందిరానికి చుట్టూ ఉండే వానరాలు భక్తులకు ఇబ్బంది కలగించకుండా వాటికి ఆహారం అందిచారు. అయోధ్య రామమందిరం ప్రారంభం అయినప్పటినుండి ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఆహారం కోసం కోతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలిసినపుడు బాధగా అనిపించి.. వాటికోసం తన వంతు కృషి చేయానుకున్నట్లు తెలిపారు. సుమారు 1200 కోతులకు నిత్యం పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. దీపావళి సందర్బంగా తల్లిదండ్రులకు నివాళులు అర్పిస్తూ వారి పేరిట కోతులకు ఆహారం అందించే ఏర్పాటు చేశారు. దీన్ని చూసి ఎక్కడున్న వారు సంతోషిస్తారని ఆశిస్తున్నట్లు మీడియాకు వివరించారు.