మంత్రి కెటిఆర్‌తో డిఎంకె ఎంపీలు స‌మావేశం

హైదరాబాద్‌ (CLiC2NEWS): త‌మిళ‌నాడు అధికార పార్టీ డిఎంకె ఎంపీలు మంత్రి కెటిఆర్‌ను తెలంగాణ భ‌వ‌న్‌లో కలిశారు. నీట్ ర‌ద్దుకు డిమాండ్ చేయాల‌ని త‌మిళ‌నాడు సిఎం స్టాలిన్ సిఎం కెసిఆర్‌కు రాసిన లేఖ‌ను ఈ సంద‌ర్భంగా డిఎంకె ఎంపీలు ఎల్ఎం గోవింద్, వీర‌స్వామి క‌లిసి కేటీఆర్‌కు అంద‌జేశారు. కేంద్ర విధానాల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నామ‌ని డీఎంకే ఎంపీలు తెలిపారు. సీఎం స్టాలిన్ రాసిన లేఖ ప‌ట్ల మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు అని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.