టీచర్లను బోధనేతర కార్యక్రమాలకు వాడుకోవద్దు: సిఎం జగన్
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు పూర్తిగా విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఉపాధ్యాయుల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితిల్లోనూ వాడుకోకూడదని సిఎం జగన్ స్పష్టం చేశారు. ఎపిలో కొత్తగా ఏర్పడనున్న జిల్లాల్లో ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు ఉండాలని సిఎం సూచించారు. ఇప్పుడున్న శిక్షణా కేంద్రాలలో నాడు-నేడు సౌకర్యాలను మొరుగుపర్చాలన్నారు. మార్చి 15వ తేదీ నుండి నాడు-నేడు రెండో విడత పనులు మొదలు పెట్టాలని సిఎం అధికారులను ఆదేశించారు.