డాక్టర్లు కష్టకాలంలో పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

రామ‌గుండం (CLiC2NEWS): అత్యవసర పరిస్థితిలో వైద్యులు, అంబులెన్స్ యజమానులు డ్రైవర్లు ఒక ప్రాణం కాపాడే రక్షకులుగా ఉండాల‌ని మంచిర్యాల జోన్ ఇన్చార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ ఐపిఎస్ అన్నారు. మంచిర్యాలలోని ఆర్ఎంపి డాక్టర్ల‌కు, అంబులెన్సుల యజమానులను సమీకరించి వారితో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జోన్ ఇన్చార్జ్ డిసిపి అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా డిసిపి మాట్లాడుతూ.. రోజు రోజుకూ మానవత్వం మంటగలిసిపోతోంది. సాటి మనిషిని మనిషిగా చూడటం లేదు. ప్రతి విషయాన్ని డబ్బే ముఖ్య మైనది గా భావిస్తున్నారు. ఆఖరికి ఆపదలో ఆదుకునే అంబులెన్స్ డ్రైవర్లు సైతం బంధువో, కుటుంబ సభ్యుడో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు రోదిస్తున్నా కొందరు డబ్బులకోసం ఆలోచిస్తున్నారు అన్నారు.

  • అత్యవసర పరిస్థితి లలో చాలా మంది హాస్పిటల్ కి చికిత్స నిమత్తమై వెళ్ళడానికి అంబులెన్స్ లను ఆశ్రయిస్తున్నారు. ప్రజల అవసరాలను బట్టి అంబులెన్సు యజమానులు ప్రజల వద్దనుండి విపరీతమైన డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి అన్నారు.
  • వైద్యులు, నర్సులు, అంబులెన్సు, మెడికల్..మొదలైన వాటిపై ప్రతిరోజూ వ్యతిరేఖంగా పిర్యాదులు, పత్రికలలో రావడం జరుగుతుంద‌ని అన్నారు.
    వైద్యం కి సంబందించిన ప్రత్యేకత నిపుణులు లేకుండా నడుస్తున్న హాస్పిటల్ లకు బాధితులను రోగులను కమిషన్ లకోసం ఆర్ఎం పి డాక్టర్ లు వైద్యం కోసం పంపిస్తున్నారు.
  • ప్రజలందరికీ ఆర్డమయ్యే విధంగా ప్రతి ఆసుపత్రిలో చార్జ్ ల బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. చార్జీల వివరాలను వెల్లడించని ఆసుపత్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
  • DMHO గారు ర్యాండమ్ గా హాస్పిటల్ చెక్ చేయడం జరుగుతుంది అన్నారు. ఆసుపత్రుల్లో చార్జీల పట్టిక ఏర్పాటు, రోగుల నుండి వసూలు చేస్తున్న చార్జీలు, ఆసుపత్రులలో అందుబాటు ఉన్న బెడ్స్ వివరాలు అన్నింటిపై టాస్క్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ చేస్తామని ఆయన తెలిపారు. ఎక్కడైనా చార్జీల వివరాలు వెల్లడించని పక్షంలో నిరంతరం అందుబాటులో ఉండే పోలిస్ హెల్ప్ లైన్ సెంబర్ 8341625367, డయల్ 100 ద్వారా సైతం సమాచారం ఇస్తే సంబంధిత ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామన్నారు.
  • డయల్ 100, నిరంతరం అందుబాటులో ఉండే పోలిస్ హెల్ప్ లైన్ నెంబర్ 8341625367 నెంబర్ లను హాస్పిటల్లో ఉండే చార్జీల బోర్డుపై ఈ ఉండేలాగా చూడాలన్నారు
  • ఆర్ఎంపీ డాక్టర్లు, అంబులెన్సు డ్రైవర్లు మరియు ఆసుపత్రుల యాజమాన్యాలు కలిసి ప్రజల అమాయకత్వాన్ని అవసరాలని ఆసరగా తీసుకొని అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని, కొన్ని సందర్భాల్లో వారికి డబ్బులు అందుబాటులో లేక ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది అన్నారు.
  • రోగి నిర్దిష్ట ఆసుపత్రికి ఏలా R mp లేదా అంబులెన్స్ డ్రైవర్ ద్వారా వచ్చారో తెలుసుకోవడానికి సర్వే చేయబడుతుంది అన్నారు.
  • ఆర్ఎంపీ డాక్టర్లు కేవలం ప్రథమ చికిత్స అందించడానికి మాత్రమే పని చేయాలి కాని కొంతమంది ల్యాబ్, ఎక్స్రేలు, ఇతర కూడా చేయడం జరుగుతుందన్నారు.
  • ఆంబులెన్స్ లకు సంబంధించిన వాహనాలు పూర్తి ఫిట్నెస్ ఉండాలి, అంబులెన్సు సంబంధించి వాహన ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ మరియు డ్రైవర్ కి డ్రైవింగ్ లైసెన్స్ తప్పక కలిగి ఉండాలన్నారు.
  • కావున ప్రజలను అంబులెన్సు వారు ఎక్కువ కిరాయ డిమాండ్ చేసి ఇ్చందుకులకు గురి చేసినట్లైతే నిరంతరం అందుబాటులో ఉండే పోలిస్ హెల్ప్ లైన్ సెంబర్ 8341625367,కు సమాచారం అందించ వచ్చును. పోలీస్ వారు మీ సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.
  • ప్రజల వద్దనుండి ఎక్కువ డబ్బులు వసూలు చేసినచో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడును. ఎవరైనా ఇబ్బంది లకు గురిచేస్తున్నారు అనే సమాచారం కూడా పైన తెలిసిన నెంబర్ కు తెలియ జేయవలిసిందిగా తెలిపారు.
  • ఈ కార్య‌క్ర‌మంలో RTO,DHMO, సూపరింటెండెంట్ govt హాస్పిటల్ , మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Leave A Reply

Your email address will not be published.