ముగిసిన డాలర్ శేషాద్రి అంత్యక్రియలు

తిరుపతి (CLiC2NEWS): తిరుపతిలోని సత్యహరిశ్చంద్ర వైకుంఠధామంలో డాలర్ శేషాద్రి అంత్యక్రియలు జరిగాయి. శేషాద్రి సోదరుడు రామానుజం తలకొరివి పెట్టారు. అంతకుముందు డాలర్ శేషాద్రి నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్రలో వైకాపా ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం సహా తితిదే సభ్యులు పాల్గొన్నారు. చెవిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ధర్మారెడ్డి పాడెమోశారు. వైకుంఠధామంలోనూ పలువురు శేషాద్రి భౌతికకాయానికి నివాళులర్పించారు.