టిటిడి నిధులను మున్సిపల్ కార్పొరేషన్‌కు పనులకు మళ్లించొద్దు: హైకోర్టు

అమరావతి (CLiC2NEWS): తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లోని పారిశుద్ధ్యపనులకు వినియోగించవద్దని హైకోర్టు ఆదేశించింది. టిటిడి నిధులు రహదారులు, పారశుద్ధ్యం పనులకు మళ్లిస్తున్నారంటూ బిజెపి నేత భాను ప్రకాశ్ రెడ్డి ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పారిశుద్ధ్య పనులకు నిధులు విడుదల చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా కాంట్రాక్టర్లకు సొమ్ము విడుదల చేయొద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే టెండర్ ప్రక్రియ కొనసాగించుకోవచ్చని తెలపింది.
టిటిడి నిధులు మళ్లించడం దేవాదాయ చట్టం సెక్షన్ 111కు విరుద్ధమని, రూ.100 కోట్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు మళ్లించారని.. గతంలో ఈ విధంగా ఎపుడూ టిటిడి నిధులు మళ్లించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వివరించారు. తదుపరి విచారణ రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.