ఇల్లు కావాలని ఎవ్వరి చుట్టూ తిరగే పనిలేదు.. మంత్రి కెటిఆర్
మా ఇంటినుండి తెచ్చిన డబ్బుతో ఇవ్వడం లేదు.

సిరిసిల్ల (CLiC2NEWS): ఇల్లు కావాలని సర్పంచులు, ఎంపిటిసిల చుట్టూ తిరగొద్దని మంత్రి కెటిఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం మంత్రి పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు, స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. సిరిసిల్ల జిల్లాలోని మొత్తం 561 మంది ఎస్‌సి లబ్ధి దారులకు ఆర్ధిక సహాయ పథకం కింద రూ. 143.61 కోట్ల సహాయాన్ని అందజేశారు. ఇంకా మండేపల్లిలో 747 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 75 గజాల స్థల పట్టాలు, గృహలక్ష్మి పట్టాలను అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మీరు ఇచ్చిన ఆశీర్వాదం వల్లే నాకు ఈ గౌరవం దక్కిందన్నారు. ఇల్లు కోసం ఎవ్వరికీ డబ్బులు ఇవ్వొద్దన్నారు. మేము మాఇంటి నండి తెచ్చిన డబ్బుతో ఇవ్వడం లేదు. మీరు కట్టిన పన్నుల్లో నుంచి ఇస్తున్నామన్నారు. ఇల్లు కావాలని ఎవ్వరి చుట్టూ తిరగవద్దన్నారు. నియోజకవర్గంలో కొంత మందకి మాత్రమే ఇళ్లు రాలేదని.. ఎంతమంది అర్హులున్నారో కలెక్టర్ చెప్పారన్నారు. వారి ఫోటోలతో సహా వివరాలు అందినవన్నారు.