ఇంటింటికీ బూస్టర్ డోసు.. మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఇంటింటికీ వెళ్లి, పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఇంటికి వచ్చినపుడు అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. సీజనల్ వ్యాధులపై జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్టు. ఐటిడిఎ పిఓలతో మంత్రుల సమీక్ష జరిగింది. వ్యాధుల నియంత్రణలో భాగంగా ప్రభుత్వం తరపున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతన్న తరణంలో ఇంటింటికీ వెళ్లి బూస్టర్ డోస్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.