15,660 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు..
హైదరాబాద్(CLiC2NEWS): ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయంను ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో 15,660 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించారు. ఈ గృహ సముదాయానికి కెసిఆర్ నగర్ 2బికె డిగ్నిటీ హౌసింగ్ కాలనీ అని నామకరణం చేశారు. ఈ గృహ సముదాయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆరుగురు లబ్ధిదారులకు కేటాయింపు పత్రాలను సిఎం అంజేశారు.
ఈ గృహ సముదాయంను 117 బ్లాకులుగా విభజన చేసి.. జి+9, జి+10, జి+11 అంతస్తుల చొప్పున కట్టారు. ఒక్కో ఇంటిని 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టారు. వీటిలో 37% భూమిలో ఇళ్లు నిర్మించారు. మిగిలిన 63% భూమిలో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.