నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు..

హైదరాబాద్ (CLiC2NEWS): ఇక నుండి నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు పరుగుతీయనున్నాయి. మంగళవారం మూడు బస్సులను రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. గతంలో మంత్రి త్వరలో హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు నడపనున్నట్లు తెలిసిందే. ఒక్కో బస్సు ధర రూ. 2.16 కోట్లు ఉంటుందని.. త్వరలో 20 బస్సులు తీసుకువస్తున్నట్లు తెలిపారు. బస్సులో 64మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. ఈ నెల 11 వ తేదీన నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, ప్యారడైజ్ నిజాంకాలేజ్ ప్రాంతాల్లో నడపనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఎస్ శాంతి కుమారి, ఎంపి రంజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరి అరవింద్ కుమార్ పాల్గొన్నారు.