తెలంగాణ డిఎంఇగా డాక్టర్ ఎ.నరేంద్రకుమార్
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో వైద్య విద్యా సంచాలకుడి (డిఎంఇ)గా డాక్టర్ ఎ.నాగేంద్ర కుమార్ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ అదనపు డిఎంఇగా కొనసాగుతున్నారు. డాక్టర్ నరేంద్రకుమార్ 2024 మార్చి 14న ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గ బాధ్యతలు స్వీకరించారు . డిఎంఇగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ అభినందనలు తెలియజేసింది.
డాక్టర్ నరేంద్రకుమార్ తెలంగాణలో తొలి రెగ్యులర్ డిఎంఇగా నియమితులయ్యారు. 2014 నుండి ఇప్పటి వరకు ఇంఛార్జి డిఎంఇలే ఉన్నారు. రాష్ట్రంలో దాదాపు 31 ఏళ్లపాటు వైద్యరంగంలో విశేషమైన సేవలందించారు.
2022-23 సంవత్సరానికి దక్షిణ భారతదేశంలో అగ్రశ్రేణి వైద్యుల జాబితా (ఇండియా టుడే సర్వే) లో ఆయనకు చోటు దక్కింది. ఈ గుర్తింపు పొందిన ఏకైక తెలంగాణ ప్రభుత్వ వైద్యుడు నరేంద్రకుమార్.
2022లో ఎన్‌టిఆర్ జీవిత సాఫల్య పురస్కారం\
2023లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పిడియాట్రిక్ సర్జన్స్(ఐఎపిఎస్) ఓరియేషన్ పురస్కారం
2024లో సిఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా దుద్ధిళ్ల శ్రీపాదరావు స్మారక పురస్కారం అందుకున్నారు.