బిఆర్ఎజిసెట్ 2025: అయిదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ప్రవేశాలు

BRAG CET 2025: ఎపిలో డా బిఆర్ అంబేడ్కర్ గురుకులం బిఆర్ఎజిసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. అయిదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రవేశ పరీక్ష ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. తాడేపల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలోని డా.బిఆర్ అంబేడ్కర్ గురుకులం విద్యాలయాలు, డా.బిఆర్ అంబేడ్కర్ ఐఐటి-మెడికల్ అకాడమీల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను అయిదవ తరగతి, ఇంటర్మీడియట్ (ఇంగ్లీష్ మీడియం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులను మార్చి 6వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు/ వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ అందిస్తారు.
ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 6 వ తేదీన నిర్వహిస్తారు. 5వ తరగతికి ఉదయం 10గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఇంటర్మీడియట్ లో ప్రవేశానికి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు ఉండనుంది.