ప్రైవేటు స్కూళ్లల్లో ఫీజుల నియంత్రణ కమిషన్ ఏర్పాటుకు సిఫార్సు
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రైవేటు స్కూళ్లల్లో ఫీజుల నియంత్రపై ముసాయిదా బిల్లును విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. 2016 లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న కమిటీలకు మాత్రమే ఫీజుల నియంత్రించే అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం ముసాయిదా బిల్లును తయారీ బాధ్యతను విద్యా కమిషన్ ఛైర్మన్‌కు అప్పగించింది. ఫీజుల నియంత్రణ కమిషన్ ఏర్పాటుకు విద్యా కమిషన్ సిఫార్సు చేసినట్లు సమాచారం.
ప్రైవేటు స్కూళ్లల్లో ఫీజులు నియంత్రణ లేకుండా పెరిగిపోతున్నాయి. ప్రతి ఏటా యాజమాన్యం ఫీజులు పెంచడం వలన మధ్య తరగతి కుటుంబాలపై ఆర్ధిక భారం పడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర స్థాయిలో కమిటిని నియమించాలని, దానికి హైకోర్టు విశ్రంత జడ్జి ఛైర్మన్‌గా ఉండేలా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని రాష్ట్ర విద్యా కమిషన్‌కు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్ ఎస్ పిఎ) విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇంజినీరిం్ ఫీజులను పెంచకుండా .. మూడేళ్ల కోసారి ఆడిట్ నివేదికలను పరిశీలించి మాత్రమే పెంపును నిర్ణయించాలని కోరారు. ఈ క్రమంలో 2009 నుండి ఫీజుల నియంత్రణ పై వచ్చిన జిఒలు , ఆదేశాలు, హైకోర్టు కార్యకలాపాలు తదితర వాటితో కూడిన పుస్తకాన్ని అంజేసినట్లు సమాచారం.