భారత నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము..
![](https://clic2news.com/wp-content/uploads/2022/06/drowpathi-murmu.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డిఎ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆమె విజయం సాధించి భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఓటింగ్ ఈ నెల 18వ తేదీన జరిగిన విషయం తెలిసినదే. గురువారం పార్లమెంట్ భవనంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఇంకో రౌండ్ ఓట్ల లెక్కింపు మిగిలిఉండగానే 50% కన్నా అధిక ఓట్లు సాధించారు. మూడో రౌండ్ ముగిసే సరికి ద్రౌపది ముర్ముకు 2161 ఓట్లు రాగా.. యశ్వంత్ సిన్హాకు 1058 ఓట్లు వచ్చాయి. నాలుగోరౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జులై 25వ తేదీన భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నారు.