అట్టహాసంగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ (CLiC2NEWS): భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాజ్‌ఘావద్ద మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్ వెళ్లారు. అక్కడ ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రెసిడెంట్ అంగరక్షక దళం ఆమెకు గౌరవందనం సమర్పించింది. అనంతరం సెంట్రల్ హాలులో సిజెఐ ఎన్వీ రమణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. ఆ వెంటనే సైన్యం 21 సార్టలు గాల్లోకి కాల్పులు జరిపి నూతన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించింది.