రేపు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగనుందని అధికారులు తెలియజేశారు. పెద్దాపూర్ పంప్ హౌజ్ దగ్గరున్న 132 కేవీ కంది-పెద్దాపూర్ ఫీడర్ లో TSPDCL నిర్వహణ పనులు చేపట్టనుంది. దీంతో గురువారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. 8 గంటలు కొన్ని ప్రాంతాల్లో పాక్షిక, మరికొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయ కలగనుంది. కావున నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరుతున్నారు.
పూర్తిగా అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:
షేక్ పేట్ రిజర్వాయర్,
బోరబండ రిజర్వాయర్,
లింగంపల్లి రిజర్వాయర్ ప్రాంతాల్లో, ఆన్ లైన్ సప్లయ్
ఖానాపూర్ గ్రావిటీ 1200 ఎంఎం మెయిన్ ఆన్ లైన్ సప్లయ్ ప్రాంతాలు
పాక్షికంగా అంతరాయం ఏర్పడు ప్రాంతాలు:
భోజగుట్ట, బంజారా, ఎర్రగడ్డ రిజర్వాయర్ల ప్రాంతాలు