Hyderabad: ఏకంగా స్కూల్లోనే మత్తు పదార్థాల తయారీ!
హైదరాబాద్ (CLiC2NEWS): ఓ వైపు పాఠశాల నడుపుతూ.. అదే పాఠశాలలో మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ పాత బోయిన్ పల్లిలోని మేధా ప్రైవేటు పాఠశాలలో అల్ప్రాజోలం తయారు చేస్తున్నట్లు సమాచారంతో ఈగల్ బృందం పోలీసులు పాఠశాలపై దాడి చేశారు. రెండు ఏళ్ల నుండి ఈ పాఠశాలను నడుపుతున్నారు. రెండంతస్థుల భవనంలో పాఠశాల పదో తరగతి వరకు సాగుతోంది. భవనంలోని రెండో అంతస్థులో మత్తుపదార్థాలు తయారీ జరుగుతుంది.
పాఠశాల నిర్వహకుడు జయప్రకాష్ గౌడ్ అల్ఫ్రాజోలం తయారీ యంత్రాలతో ఈ మత్తుపదార్థాలను తయారు చేస్తున్నట్లు సమాచారం. పాఠశాలను నిర్వాహకుడే మత్తు పదార్థాలు తయారు చేస్తున్నాడని తెలిసే సరికి విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయానికి లోనయ్యారు. స్కూల్ నుండి రూ.20 లక్షల నగదుతో పాటు దాదాపు కోటి రూపాయల విలువైన 7 కిలోల అల్ప్రాజోలంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులకు సైతం అనుమానం రాకుండా మత్తుపదార్థాలను తయారు చేయడం గమనార్హం.
Also Read: కోడుమూరు: విద్యార్థులపై తేనెటీగల దాడి
[…] […]