Elections: డిఎస్‌సి పరీక్ష వాయిదా..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష వాయిదా పడినట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. డిఎస్‌సి నియామక పరీక్షకు నవంబర్ 20 నుండి 30 వరకు టిఆర్ టి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, నవంబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేశారు. సెప్టెంబర్ 20 నుండి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది.