స‌ర‌స్వ‌తీదేవి రూపంలో ఇంద్ర‌కీలాద్రిపైనున్న‌ దుర్గ‌మ్మ

విజ‌య‌వాడ (CLiC2NEWS): తెలుగు రాష్ట్రాల్లో అమ్మ‌వారి ఆల‌యాలు భ‌క్తులతో కిట‌కిట‌లాడుతున్నాయి. మూలా న‌క్ష‌త్రం సంద‌ర్బంగా ఇంద్ర‌కీలాద్రిపైనున్న‌ దుర్గ‌మ్మ స‌రస్వ‌తీదేవి అలంకారంలో బుధ‌వారం భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తున్నారు. శ‌రన్న‌వ‌రాత్రుల్లో మూలా న‌క్ష‌త్రం రోజున స‌ర‌స్వ‌తీ దేవిని ద‌ర్శించుకోవ‌డం ద్వారా విద్యార్థులు వాగ్దేవి అనుగ్ర‌హం పొంది స‌ర్వ విద్యల‌లో విజ‌యం సాధిస్తార‌ని న‌మ్మ‌కం. భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించేందుకు వేకువ‌జామున 3 గంట‌ల నుండి స‌ర్వ‌ద‌ర్శ‌నం క‌ల్పించారు. భ‌క్తుల‌కు ల‌డ్డూను ఉచితంగా అంద‌జేస్తున్నారు. నేడు 2 ల‌క్ష‌ల‌కు పైగా భ‌క్తులు అమ్మ‌వారిని ద‌ర్శించుకునే అవ‌కాశ‌మున్న‌ట్లు అధికారులు అంచనీ వేశారు.

Leave A Reply

Your email address will not be published.