19 నుండి జూనియర్ కాలేజీలకు దసరా సెలవులు..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19వ తేదీ నుండి దసరా సెలవులు ప్రకటించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఈ నెల 19 నుండి 25 వరకు సెలవులు ప్రకటించినట్లు పేర్కొంది. పాఠశాలలకు ఈ నెల 13 నుండి 25 వరకు దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 23న బతుకమ్మ పండుగక.. 25న దసరా పండుగ సందర్భంగా 25 వరకు సెలవులు ప్రకటించారు.