TS: హైకోర్టుకు దసరా సెలవులు
![](https://clic2news.com/wp-content/uploads/2020/11/high-court.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ హైకోర్టుకు దసరా పండుగ సందర్భంగా ఈ నెల 7 నుంచి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ అనుపమా చక్రవర్తి ఉత్తర్వులు జారీచేశారు. సెలవుల్లో అత్యవసరమైన కేసులను 8వ తేదీన దాఖలు చేసుకోవాలని తెలిపారు. అత్యవసర కేసులను 11వ తేదీన జస్టిస్ షమీమ్ అఖ్తర్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం, జస్టిస్ అభిషేక్‌రెడ్డి విచారిస్తారని తెలిపారు. హైకోర్టు తిరిగి 18వ తేదీన ప్రారంభమవుతుందని తెలిపారు.