EAPCET: ఈఏపీసెట్ 2021 ఫలితాలు విడుదల

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌, వ్య‌వ‌సాయ‌, ఫార్మ‌సీ కోర్స‌ల్లో చేరేందుకు నిర్వ‌హించిన ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష `ఎపి ఈఎపిసెట్‌` ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. ఈ మేర‌కు ఎపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదల చేశారు.  విద్యార్థులు రేపటి నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ తదితర కోర్సులకు గతంలో ఏపీ ఎంసెట్‌ పేరుతో నిర్వహించేవారు.

ముందుగా ఇంజినీరింగ్ (ఎంపిసి, స్ట్రీమ్‌), ఆ త‌ర్వాత వ్య‌వ‌సాయ‌, ఫార్మ‌సీ ప్ర‌వేశాలు నిర్వ‌హించ‌నున్నారు. ఎంపిసీ, స్ట్రీమ్‌కు 1,76,603 మంది ద‌ర‌ఖాస్తు చేయ‌గా .. 1,66,460 మంది హాజ‌ర‌య్యారు.

Leave A Reply

Your email address will not be published.