టర్కీ, సిరియాలో భూకంప విలయం.. 5వేలు దాటిన మృతుల సంఖ్య

అంకార (CLiC2NEWS): భూకంపం దాటికి రెండు దేశాలు అతలాకుతలమైపోయాయి. భారీగా ఆస్థి, ప్రాణ నష్టం సంభవించింది. మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. తుర్కియో, సిరియా దేశాలలో సంభవించిన ప్రకృతి విలయానికి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్యం 5వేలకు పైమాటే. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు డబ్లుహెచ్ఒ తెలిపింది. ఒక తుర్కియో దేశంలో 20వేలకు మందికి పైగా గాయపడ్డారు. సిరియాలో 2వేల మంది గాయపడి ఉంటారని అంచనా వేస్తున్నారు. కాగా.. తుర్కియో దేశంలో భూకంపం తర్వాత ఇప్పటి వరకు భూమి దాదాపు 200 సార్లు కంపించినట్లు అధికారులు తెలుపుతున్నారు. దీంతో అక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్లు వెల్లడించారు. గాజియాన్ తెప్ నగరానికి ఉత్తరాన 33 కిలోమీటర్ల దూరంలో , భూఉపరితలానికి 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు.