ఆఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. 255 మంది మృతి!

కాబూల్ (CLiC2NEWS): ఆఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభ‌వించింది. ఈ భూకంపం ధాటికి 155 మంది మృత్యువాత ప‌డ్డారు. మరికొంద‌రికి గాయాల‌య్యాయియ‌. తూర్పు ప‌క్టికా ప్రావిన్స్‌లో ప్రాణ‌, ఆస్తి న‌ష్టం ఎక్కువ‌గా ఉంది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 6.1గా న‌మోదైన‌ట్లు అమెరికా జియోలాజిక‌ల్ స‌ర్వే వెల్ల‌డించింది. ఆఫ్గాన్‌లోని ఖోస్ట్ న‌గ‌రానికి 44 కిలోమీట‌ర్ల దూరంలో 51 కిలోమీట‌ర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్న‌ట్లు తెలిపింది.

భూకంప ధాటికి వంద‌ల మంది గాయ‌ప‌డ్డారు. భారీగా ఇళ్లు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. అనేక మంది శిథిలాల కింది చిక్కుకుని మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. భూకంప ప్ర‌భావిత ప్రాంతాల్లో స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయి.

పాకిస్థాన్‌లోనూ ప‌లుచోట్ల ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. ఫెషావ‌ర్‌, ఇస్లామాబాద్‌, లాహోర్‌, ఖైబ‌ర్ పఖ్తుంఖ్వా, పంజాబ్ ప్రావిన్స్ ప‌లు ప్రాంతాల్లో ప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. ఇక్క‌డ ఎలాంటి ప్రాణ‌, ఆస్థి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని అధికారులు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.