7.1తీవ్రతతో జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

టోక్యో (CLiC2NEWS): జపాన్‌లో గురువారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైనట్లు సమాచారం. ఈ ఏడాది మొదటి రోజే జపాన్‌లో భూకంపం సంభవించి 200 మందికి పైగా మృతి చెందారు. ఇపుడు మరోసారి భూకంపం జపాన్ ప్రజలను వణికించింది. 30 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు జపాన్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భూకంప కేంద్రం సమీపంలోని విమానాశ్రయం అద్దాలు దెబ్బతిన్నాయని సమాచారం. మరోవైపు ఈ భూకంపం వలన సునామీ హెచ్చరికలు జారీ చేశారు. క్యుషు, దగ్గర్లోని షికోకు ద్వీపాన్ని ఒక మీటరు ఎత్తుతో అలలు తాకొచ్చని ప్రజలను అప్రమత్తం చేశారు.