టర్కీ, సిరాయాలో భూకంపం.. 2300కి చేరిన మృతులు

ఇస్తాంబుల్ (CLiC2NEWS): తుర్కియో (టర్కీ), సిరియా దేశాలలో సంభవించిన భూకంపం సంభవించిన విషయం తెలిసినదే. భూకంపం ధాటికి దేశంలోని భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక మంది ప్రజలు మృత్యువాతపడిన విషయం తెలిసినదే. మరణించిన వారి సంఖ్య 2300కి చేరింది. ఇంకా భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం వచ్చిన తర్వాత కూడా ప్రకంపలనలు కొనసాగడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు.