మరోసారి నేపాల్‌లో భూప్రకంపనలు.. ఢిల్లీలోనూ ప్రభావం
ఢిల్లీ (CLiC2NEWS): వరుసగా భూ ప్రకంపనలు కారణంగా నేపాల్‌లోని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవిస్తున్నారు. తాజాగా సోమవారం మరోసారి 5.6 తీవ్రతో భూమి కంపించింది. నేపాల్‌లో ఇది రెండో సారి వచ్చిన భూకంపం. దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలో కూడా కనిపించింది. ఇళ్లు, కార్యాలయాల్లోని వస్తువులు కదిలినట్లు సమాచారం. ప్రజలు ఇండ్లనుండి బయటకు పరుగులు తీశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ఆయోధ్యకు ఉత్తరంగా 233 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజి వెల్లడించింది.
నేపాల్‌లో ఈనెల 3వ తేదీన సంభవించిన భూ ప్రకంపనల కారణంగా 157 మంది మృత్యువాత పడ్డారు. మరో 150 మందకి పైగా గాయపడి చికిత్స పొందుతున్నారు. 4వ తేదీ సాయంత్రం వరకు 159 సార్లు భూప్రకంపనలు సంభవించినట్లు సమాచారం.