జమ్ముకాశ్మీర్, ఢిల్లీలలో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 5.4 నమోదు

ఢిల్లీ (CLiC2NEWS): జమ్మూకశ్మీర్‌లోని దోడాలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీ. పంజాబ్ పలు ఉత్తరాది ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీలో 10 సెకన్లపాటు భూమి కంపించింది. ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లనుండి బయటకు పరుగులు తీశారు. జమ్ముకశ్మీర్‌లోని దోడాలోని గందో భలేసా గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో 6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. భారత్‌లోనే కాకుండా అటు పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం భూప్రకంపనలు సంభవించినట్లు, రిక్టర్ స్కేల్‌పై 5.6 భూకంప తీవ్రత నమోదైనట్లు పాకిస్థాన్ వాతావరణ శాఖ వెల్లడించింది.