బొప్పాయి పండు.. లాభాలు మెండు!

 బొప్పాయి  

శాస్త్రీయ నామం: కైరికా
కుటుంబం: కైరికేసి
ఇంగ్లీష్ పేరు: పపాయా
హిందీ: పపీతా
తెలుగులో: బొప్పాయి

ఇది మనకు ఇతర దేశాల నుంచి వచ్చింది. మొదటగా కేరళకు ప్రాంతానికి వచ్చింది కేరళ వారు బొప్పాయిని కప్పకాయ అంటారు . కప్పకాయ అంటే ఓడ ద్వారా తేబడిన ఫలం అని అర్థము

ఇది భారతదేశంలో ప్రతి ఇళ్ల‌లో, తోటల్లో గాని దీన్ని పుష్కలంగా పెంచుతారు.

దీని యొక్క బాహ్య స్వరూపం..

బొప్పాయి చెట్టు చాలా త్వరగా పెరుగుతుంది. దీని కాండం చాలా బలంగా ఉంటుంది. సుమారు ఇది 5,6 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది. పొట్టిగా నిటారుగా పెరుగుతాయి కాండం సున్నితంగా ఉంటుంది. బోలుగా ఉంటుంది. చాలా తక్కువ సంవత్సరాలు బ్రతుకుతుంది . ఇది బూడిద రంగులో ఉంటుంది ఆకులు అందమైన ఆకృతి లాగా కత్తిరించినట్లుగా ఉంటాయి. ఈనెలుగా విడిపోయి ఉంటాయి. ఇవి ఏకలింగ పుష్పాలు సుగంధ భరితంగా ఉంటాయి. పచ్చని రంగులో తెల్ల రంగుల్లో గుత్తులు గుత్తులుగా ఉంటాయి. బొప్పాయి పచ్చగా గుండ్రంగా ఉంటుంది మధ్యలో లావుగా ఉంటుంది. పచ్చి బొప్పాయి ఆకుపచ్చగా పండిన తర్వాత పసుపుపవర్ణంలో వస్తుంది. పండ్ల మధ్యలో నల్లని రంగు గల గింజలు ఉంటాయి. బొప్పాయి పండిన తర్వాత చాలా తియ్యగా ఉంటుంది. ఈ మొక్కకు చెందిన ఏ భాగానికి గాని గాటు పెట్టినట్లయితే పాలు కారుతాయి. ఇది సంవత్సరం పొడుగునా పుష్పిస్తుంది.

రసాయనక సమ్మేళనం

బొప్పాయి ఆకుల్లో బి కిరోటి నాయిడ్స్, రొటీన్, ఫైటోన్, గ్ గ్లైకోసైట్ , కార్ఫిన్ అనే పేర్లతో క్షరాభ,, ఈ విటమిన్ లు, బికెరోటిన్, క్రిప్టోజెంతిన్,ఏంథ్ర జెంతిన్లు,లభ్యమవుతాయి.

బొప్పాయి విత్తనాల్లో హెమ్ట్రై ఏకోమ్టైన్, బోసిటోస్టెరాల్, గ్లూకోజ్ లభ్యమవుతాయి.

దీని స్వరసంలో బ్యూటా యిరిక్ ఆమ్లం, అక్టనోయిక్ ఆమ్లం లభ్యమవుతాయి.

డెంగ్యూ సమస్య నివారించడానికి బొప్పాయి ఆకుల రసం ప్రాణదాయినిలా పనిచేస్తుంది.

డెంగ్యూ వైరస్ మన లివర్ మీద డైరెక్ట్ ప్రభావం చూపుతుంది. దీని నివారించడానికి బొప్పాయి ఆకు రసం ప్రాణదాయిని లా పనిచేస్తుంది. అలాగనే ప్లేట్లెట్స్ సంఖ్యని అసాధారణ స్థాయిలో పెంచుతుంది. బొప్పాయి ఆకుల్ని శుభ్రంగా కడిగి రెండు మూడు ఆకులు మిక్సీలో వేసి ఆ రసాన్ని తీసి వడగట్టి ఉదయాన్నే పరిగడుపున రెండుసార్లు లేదా మూడుసార్లు తీసుకోవాలి. బొప్పాయి ఆకు రసం,తిప్పతీగ రసం, దానిమ్మ గింజల రసము, గోధుమ నారు రసము, రోజుకు రెండుసార్లు ఇస్తే డెంగ్యూ జ్వరం త్వరగా నియంత్రించవచ్చును.

దంతసూల.

బొప్పాయి పాలల్లో దూది ముంచి పెట్టుకుంటే దంత నొప్పి తగ్గుతుంది.

బొప్పాయి పండ్లను సేవిస్తే కాలేయము ప్లిహాము రోగాలు తగ్గుతాయి.

విష చికిత్స

బొప్పాయి కాయల నుంచి వచ్చే పాలను తేలు కరచిన చోట రాస్తే విషం చాలా పోతుంది.

బొప్పాయి పాలు జీర్ణశక్తిని పెంచుతాయి.

బొప్పాయి పాల వల్ల గర్భస్రావం జరుగుతుంది. దీని మూలంలో కార్బో సైడ్ ఒక రకమైన ఎంజాయ్ మైరోసిన్ ఉంటుంది దీనివల్ల ఇది గర్భస్రావ కారకంగా పనిచేస్తుంది.

బొప్పాయి సేవిస్తే రక్త మూలశంక తగ్గుతుంది.

పచ్చి బొప్పాయి తింటే అజీర్తి అవుతుంది. కడుపులో నొప్పి కూడా వస్తుంది. ప్రతిరోజు బొప్పాయి కాయ తిన్న సరే వేడి చేస్తుంది. పండుని పండులాగా తినాలని విచ్చలవిడిగా తినరాదు. ఒకవేళ ప్రతిరోజు దినాలనుకున్నప్పుడు అన్ని ఫ్రూట్ సలాడ్స్ లో దీన్ని కూడా కలుపుకొని తినవచ్చును.

-షేక్. బహార్ అలీ
యోగాచార్యుడు, ఆయుర్వేద వైద్యుడు


Leave A Reply

Your email address will not be published.