ఓ వ్యాపారి ఇంట్లో రూ. 7కోట్ల నోట్ల గుట్టలు..!
![](https://clic2news.com/wp-content/uploads/2022/09/7-crore-money-foung-in-house-in-kolkatta.jpg)
కోల్‌కతా (CLiC2NEWS): పశ్చిమ బెంగాల్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో సుమారు రూ. 7 కోట్లు నగదును శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్‌కు చెందిన మెబైల్ గేమింగ్ యాప్ మోసాలకు పాల్పడుతున్నట్లు, యూజర్ల వద్ద నుండి భారీ డబ్బులు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో చేపట్టిన తనిఖీలలో కంపెనీ ప్రమోటర్ నివాసంలో శనివారం ఈడి సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు రూ. 7 కోట్ల నగదు లభ్యమయ్యింది. ఇంకా లెక్కింపు కొనసాగుతుంది. అధికారలు నగదుతో పాటు కొన్ని ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు నిర్వహించే మొబైల్ గేమింగ్ యాప్‌కు చైనా నియంత్రణలో నడుస్తున్న రుణ యాప్‌లతో సంబంధం ఉందా.. లేదా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.