గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు అవకాశం..
హైదరాబాద్ (CLiC2NEWS): గ్రూప్-4 అభ్యర్థుల దరఖాస్తుల్లోని తప్పులను సవరించుకునేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అవకాశం కల్పించింది. అభ్యర్థుల దరఖాస్తుల్లో తప్పులు ఉంటే.. వాటిని సవరించుకునేందుకు వీలుగా ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అభ్యర్థులు మే 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ వినియోగించుకోవచ్చని వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలు ఉండగా.. 9,51,321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. జులై 1వ తేదీన గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నారు.