ఎడిటర్ గౌతం రాజు కన్నుమూత
![](https://clic2news.com/wp-content/uploads/2022/07/Goutham-Raju.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం అర్థరాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. గౌతమ్ రాజు మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనకు శాంతి చేకూరాలని సంతాపం వ్యక్తం చేశారు.
గౌతమ్ రాజు దాదాపు 850పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. తెలుగు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన పలు చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసి చెరగని ముద్రవేశారు. తెలుగులో చిరంజీవి, పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ నటించిన ఎన్నో చిత్రాలకు ఆయన పనిచేశారు.