ముగిసిన మహారాష్ట్ర పోలింగ్

ముంబయి (CLiC2NEWS): మహారాష్ట్ర , ఝార్ఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మహారాష్ట్రలో బుధవారం మొత్తం 288 నియోజకవర్గాలకు ఒకే విడతో పోలింగ్ జరిగింది. ఈ రోజు ఉదయం నుండే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు. పలువురు రాజకీయ నేతలతో పాటు సినీ, క్రీడా ప్రముఖులు కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ పోలింగ్ మొదలైన తొలి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ శిండే డిప్యూటి సిఎంలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబంతో కలిసి ఓటువేశారు. రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తి కాంత దాస్, సినీప్రముఖులు సల్మాన్‌ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సచిన్ టెండూల్కర్, ఎంపి హేమామాలిని ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు ఎంతో ముఖ్యమైనదని,మార్పుకావాలంటే ఓటేసేందుకు ముందుకు రావాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు.