ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్ (2024)

ఎపి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 (175/175) |
|||
Party | Lead | Won | |
TDP | ![]() |
– | 135 |
---|---|---|---|
JANASENA | ![]() |
– | 21 |
BJP | ![]() |
– | 8 |
YSRCP | ![]() |
– | 11 |
Others | 0 |
ఎపి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 (25/25) |
|||
Party | Lead | Won | |
TDP | ![]() |
– | 16 |
---|---|---|---|
JANASENA | ![]() |
– | 2 |
BJP | ![]() |
– | 3 |
YSRCP | ![]() |
– | 4 |
Others | 0 |
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024 (17/17) |
|||
Party | Lead | Won | |
CONGRESS | ![]() |
– | 8 |
---|---|---|---|
BRS | ![]() |
– | – |
BJP | ![]() |
– | 8 |
MIM | ![]() |
– | 1 |
Others | 0 |
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు 2024 (543/543)
PARTY
BJP+
CONGRESS+
OTHERS
LEAD
0
0
0
WIN
293
199
51
————————————————————————-
లైవ్ బ్లాగ్:
-
జనసేన గెలుపు 5 కోట్ల మంది ఆకాంక్షః పవన్ కల్యాణ్
జనసేన గెలవడం ఆంధ్రప్రదేశ్‌లోని ఐదుకోట్ల మంది ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఫలితాల అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఇది కక్ష సాధింపుల సమయం కాదని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి బలమైన పునాదులు వేసే సమయమని అన్నారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు గుర్తున్నాయని తెలిపారు. పోటీ చేసింది 21 సీట్లే అయిన 175 సీట్లలో గెలిపిస్తే ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యతగా పనిచేస్తామన్నారు. ప్రజలకు జవాబుదారీ తనం చెప్పే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందని స్పష్టం చేశారు.
-
జనసేన పోటి చేసిన అన్ని చోట్లా విజయం..
- జనసేన స్ట్రైక్ రేట్ 100%
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టి సరికొత్త రికార్డు సృష్టించింది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టి కేవలం ఒక్క స్థానం మాత్రమే గెలిచింది. ఈ సారి 21 స్థానాల్లో విజయభేరి మోగించింది. పోటిచేసిన 21 స్థానాల్లో విజయం సాధించి 100 శాతం విజయం సొంతం చేసుకుంది. అటు రెండు లోక్‌సభ స్థానాల్లో మాత్రమే పోటీ చేయగా.. రెండు స్థానాల్లో కూడా విజయం సాధించింది. మరోవైపు బిజెపి 10 స్థానాల్లో పోటీచేయగా 8 స్థానాల్లో విజయం సాధించింది.
- ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు సరబ్జీత్ సింగ్ విజయం
ఫరిద్కోటలో మాజి ప్రధాని ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకడైన బియాంత్ సింగ్ కుమారుడు సరబ్జీత్ సింగ్ విజయం సాధించారు. ఆయన పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో స్వతంత్ర అభ్చర్థిగా నిలబడ్డారు. తన సమీప ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిపై 70 ఓట్ల మెజార్టితో గెలుపొందారు.
- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
- పెద్దపెల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
- నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 5.51 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి 4.56 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.
- వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2.02 లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.
- మహబూబ్‌నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3.24 లక్షల మెజారిటీతో గెలుపొందారు.
- జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 45 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- నాగర్ కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 85 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- నిజామాబాద్‌లో బిజెపి అభ్యర్థి ధర్మపురి అర్వీంద్ 1.13 లక్షల కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- కరీంనగర్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 2.12 లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందారు.
- ఆదిలాద్ లోక్ సభ నుంచి బిజెపి అబ్యర్థి గోడం నగేష్ 78 వేలకు పైగా ఓట్లతో భారీ మెజార్జీతో గెలుపొందారు.
- పులివెందులలో జగన్ గెలుపు
వైసీపి అధినేత, ప్రస్తుత సిఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి , టిడిపి అభ్యర్థి ఎం రవీంద్రనాథ్ రెడ్డిపై 61176 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గత ఎన్నికలతో పోలిస్తే జగన్‌కు 28 వేల ఓట్ల మెజారిటీ తగ్గింది.
- హిందూపురంలో బాలకృష్ణ విజయం
ప్రముఖ సినీ నటుడు, టిడిప అభ్యర్థి నందమూరి బాలకృష్ణ విజయం సాధించారు. హిందూపురం నుంచి పోటీ చేసిన బాలకృష్ణ వరసగా మూడో సారి గెలుపొందారు. దీంతో హ్యాట్రిక్ కొట్టినట్లయింది.
- తిరువనంతపురంలో శశిథరూర్ విజయం
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఘన విజయం సాధించారు. కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థిగా శశి థరూర్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి బిజెపి అభ్యర్థతి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌పై 15 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో వరుసగా ఇక్కడి నుంచి శశి థరూర్ నాలుగో సారి విజయం సాధించడం విశేషం.
- రాజంపేటలో వైసిపి బోణీ
ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చతికిలపడింది. ఎట్టకేలకు రాజంపేట నుంచి వైసీపి తొలి విజయం సాధించారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన అమర్నాథ్ రెడ్డి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి టిడిపి అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యంపై అమర్నాథ్ రెడ్డి గెలుపొందారు.
-
వయనాడ్, రాయ్‌బరేలీలో రాహుల్ విజయం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసిన రెండు చోట్లా విజయం సాధించారు. ఆయన కేరళలోని వయనాడ్ నుంచి, అలాగే యూపిలో రాయ్ బరేలీ నుంచి విజయం సాధించారు. వయనాడ్‌లో తన సమీప ప్రత్యర్థి సిపై అభ్యర్థి యానీ రాజాపై 3.5 లక్షలకుపైగా మెజారిటీతో ఆయన రెండో సారి గెలుపొందారు.
అటు యుపిలోని రాయ్ బరేలీ నుంచి 3.7 లక్షలకు పై చిలుకు మెజారిటీతో జయకేతనం ఎగురవేసింది. రాయ్ బరేలీ కాంగ్రెస్ కంచుకోటఅన్న విషయం తెలిసిందే.
- బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఘన విజయం
ప్రముఖ బాలీవుడ్ నటి ఎంపి ఎన్నికల్లో విజయం సాధించారు. రాజకీయ అరంగేట్రంతోనే జయకేతనం ఎగురవేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి భారతీయ జనతాపార్టీ నుంచి పోటీ చేసిన కంగనా రనౌత్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 71 వేల ఓట్ల మెజారిటీతో కంగనా విజయం సాధించారు.
- సాలూరు, కళ్యాణ దుర్గంలో టిడిపి విజయం
కళ్యాణ దుర్గంలో నిజయోజక వర్గంలో టిడిపి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, వైసీపి అభ్యర్థి తలారి రంగయ్యపై 37011 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
- సాలూరు (ఎస్సీ) నియోజకవర్గంలో టిడిపి విజయం సాధించింది. వైసిపీ అభ్యర్థి పీడిక రాజన్న దొరపై గుమ్మిడి సంధ్యారాణి 13071 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటమి
ఎన్నికల వేళ మాచర్లలో దారుణ మారణకాండను సృష్టించిన వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓటమి పాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి టిడిపి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు.
- పిఠాపురంలో పవన్ ఘన విజయం
ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత, పిఠాపురం అభ్యర్థి పవన్ కల్యాణ్ ఘన విజయం సాధించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయన్ను స్థానిక ప్రజలు గెలిపించారు. తన సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్లు మెజారిటీతో ఘన విజయం సాధించారు.
- మంత్రి అంబటి రాంబాబు పరాజయం
వైఎస్సార్సీపీ మంత్రి అంబటి రాంబాబు ఓటమి పాలయ్యారు. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేసిన అంబటి రాంబాబు ఓటమి పాలయ్యారు. తన సమీప ప్రత్యర్థి, టిడిపి కన్నా లక్ష్మీ నారాయణ విజయం సాధించారు.
- పార్వతీపురం నియోజకవర్గం టిడిప అభ్యర్థి బోనెల విజయ్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావుపై 23650 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- రాప్తాడులో పరిటాల సునీత గెలుపు
రాప్తాడులో టిడిపి అభ్యర్థి పరిటాల సునీత గెలుపొందారు. తన సమీ ప్రత్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిపై 22196 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.
- మైలవరంలో టిడిపి గెలుపొందింది. వైసీపీ అభ్యర్థి ఎస్. తిరుపతి రావుపై వసంత వెంకట కృష్ణ ప్రసాద్ 42829 కోట్ల మెజారిటీతో గెలుపొందారు.
- తణుకులో టిడిపి గెలుపు
తణుకులో టిడిపి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ తన సమీప ప్రత్యర్థి, వైసీపి అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై 71059 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
-
తాడేపల్లి గూడెంలో జనసేన గెలుపు
తాడేపల్లి గూడెంలో జనసేన అభ్యర్థి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి , వైసీపీ అభ్యర్థి కోట్లు సత్యనారాయణపై బొలిశెట్టి శ్రీనివాస్ 61510 ఓట్ల మెజారిటీ ఓట్లతో గెలుపొందారు.
- కమలాపురంలో జగన్ మేనమామ ఓటమి
వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో జగన్ మేనమామ, వైసీపి అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డిపై టిడిపి అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి విజయం సాధించారు.
- మైదుకూరులో టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ 20937 ఓట్ల తేడీతో గెలుపు సాధించారు.
- కడప స్థానంలో టిడిపి అభ్యర్థి మాధవి రెడ్డి తన సమీప వైసీపీ అభ్యర్థి, డిప్యూటీ సిఎం అంజాద్ బాషాపై విజయం సాధించారు.
గుంటూరు ఈస్ట్, అనంత పట్టణం, డోన్ లో టిడిపి గెలుపు
గూంటూరు తూర్పు నియోజక వర్గంలో టిడిపి అభ్యర్థి మహ్మద్ నజీర్ విజయం సాధించారు.
అనంతపురం పట్టణం టిడిపి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తన సమీప ప్రత్యర్థి, వైసిపి అభ్యర్థి వెంకట్రామి రెడ్డిపై 20879 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్‌పై డోన్ టిడిపి అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి విజయం సాధించారు.
గోపాల పురంలో టిడిపి గెలుపు
తూ.గో జిల్లా గోపాలపురంలో టిడిపి అభ్యర్థి మద్దిపాటి వెంకట రాజు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసిపి అబ్యర్థి తానేటి వనితపై 26527 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- నరసాపురంలో జనసేన విజయం
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జనసేన అభ్యర్థి నాయకర్ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి ఎన్. వరప్రసాద రాజుపై 49096 ఓట్ల మెజారిటితో గెలుపొందారు.
- ఏలూరులో టిడిపి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ విజయం.
ఏలూరులో టిడిపి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ విజయం సాధంచారు. తన సమీప ప్రత్యర్థి ఆళ్ల నానిపై 61261 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- ఉండిలో రాఘురామ కృష్ట గెలుపు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టిడిపి అభ్యర్థి రఘురామ కృష్ణరాజు విజయం సాధించారు. తన సమీ ప్రత్యర్థి , వైసిపి అభ్యర్థి పివిఎల్ నరసింహ రాజుపై 56777 ఓట్ల తేడాతో గెలుపొందారు.
- ఆచంటలో టిడిపి గెలుపు
పశ్చిమ గోదావరిలో జిల్లా ఆచంటలో టిడిపి విజయం సాధించింది. టిడిపి అభ్యర్థి పితాని సత్యనారాయణ తన సమీప ప్రత్యర్ధి , వైసీపి అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథ రాజుపై 22076 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- ఉరవ కొందడలో పయ్యావుల కేశ్ విజయం
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి వై శ్వేశ్వరరెడ్డి పై కేశవ్ విజయం సాధించారు.
- భీమవరం, రాజానగరంలో జనసేన గెలుపు
కూటమి అభ్యర్థులు భారీ విజయాన్ని నమోదు చేస్తున్నారు. తాజాగా రాజానగరం నుంచి జనసేన తొలి విజయాన్ని నమోద చేసింది. రాజానగరం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి జలరామ కృష్ణ తన సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి జక్కంపూడి రాజాపై గెలుపొందారు.
భీమవరంలో జనసేన గెలుపు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన సేన ఘన విజయం సాధించింది. ఇక్కడి నుంచి పువర్థి ఆంజనేయులు గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి గ్రంధి శ్రీనివాస్‌పై 66974 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- నారా లోకేశ్ ఘన విజయం
ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, జనసే, బిజెపి కూటమి భారీ విజయం దిశగా దూసుకు పోతోంది.కూటమి అభ్యర్థి, తెలుగు దేశం ప్రధాన కార్యదర్శి, మంగలగిరి టిడిపి అభ్యర్థి నారా లోకేశ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపి అభ్యర్థి మురుగుడు లావణ్యపై లోకేశ్ గెలుపొందారు.
బాపట్ల, చింతలపూడిలో టిడిపి విజయం
ఏలూరు జిల్లా లో అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకువెళ్తుంది. చింతలపూడి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి సొంగా రోషన్ గెలుపొందారు. తన సమీప అభ్యర్థి వైసీపా నుంచి పోటీ చేసిన కంభం విజయరాజుపై 26 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది.
బాపట్ల నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి వేగేశ్న నరేంద్ర కుమార్ గెలుపొందారు. తన సమీప వైపీపి అభ్యర్థి కోన రఘుపతి పై నరేంద్ర కుమార్ విజయం సాధించారు.
- తెలంగాణలో కాంగ్రెస్ తొలి గెలుపు
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నలోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బోణి కొట్టింది. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి విజయం సాధించారు.
- కొవ్వూరులో టిడిపి గెలుపు
ఎపిలో కూటమి జోరు కొనసాగుతోంది. తూ గో జిల్లా లోని కొవ్వూరు (ఎస్సీ) నియోజకవర్గంలో టిడిపి విజయంసాధించింది. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావుపై టిడిపి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు.
- ఆంధ్రలో బిజెపి తొలి గెలుపు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులు విజయం దిశగాదూసుకువెళ్తున్నారు. ఇప్పటికే టిడిపికి చెందిన ఇద్దరు విజయం నమోదు చేశారు. తాజాగా బిజెపి అభ్యర్థి తొలి గెలుపును నమోదు చేశారు.
కూటమి నుంచి పోటీ చేసిన తూర్పు గోదావరి జిల్లా అననపర్తి నియోజకవర్గం బిజెపి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ అబ్యర్థి ఎస్ సూర్యనారాయణ రెడ్డిపై 20567 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
- భారీ ఆధిక్యం దిశగా అమిత్‌షా
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. గుజరాత్ లోని గాంధీ నగర్ నుంచి పోటీ చేసిన అమిత్‌షా తన సమీప ప్రత్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై దాదాపు 3 లక్షలకు పైగా ఆధిక్యంలో దూసుకువెళ్తున్నారు.
- రెండో విజయం నమోదు చేసిన టిడిపి
ఎపి అంసెబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం రెండో విజయం నమోదు చేసింది.
రాజమహేంద్ర వరం (పట్టణం) సీటును టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తన సమీప ప్రత్యర్థి వైసీపి అబ్యర్థి మార్గాని భరత్‌రామ్ పై 55 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
-
బుచ్చయ్య చౌదరి విజయం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం తొలి విజయం సాధించింది.
రాజమహేంద్రవరం రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వైసిపి అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 63,053 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సునామి సృష్టిస్తోంది.
విజయం దిశగా టిడిపి, జనసేన, బిజెపి అభ్యర్థులు దూసుకుపోతున్నారు.
చంద్రబాబు, పవన్‌కల్యాణ్ విజయం దిశగా దూసుకుపోతున్నారు.
మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్, హిందూపూర్ టిడిపి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ విజయం దిశగా దూసుకుపోతున్నారు.